ఆపరేషన్ సిందూర్‌లో అమరులైంది వీరే.

తొలిసారిగా పేర్లను వెల్లడించిన కేంద్రం

జనం న్యూస్ : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను తొలిసారిగి బహిరంగంగా వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను తొలిసారిగి బహిరంగంగా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన సైనిక సిబ్బంది వివరాలను ఇప్పుడు ఆర్మీ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ జాబితాలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ మురళీ నాయక్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ అనే ఐదుగురు ఆర్మీ సిబ్బందితో పాటు, భారత వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ కూడా ఉన్నారు. వీరమరణం పొందిన ఈ సైనిక సిబ్బంది పేర్లను ఆర్మీ వార్ మెమోరియల్ యొక్క 2025 రోల్ ఆఫ్ హానర్‌లో చేర్చారు. ఈ జాబితాలో ఆ సంవత్సరంలో వివిధ సైనిక కార్యకలాపాలలో ప్రాణాలు అర్పించిన సైనికుల పేర్లను నమోదు చేస్తారు. వీరి పేర్లను ఢిల్లీలో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం (వార్ మెమోరియల్) వద్ద ప్రత్యేక శిలాఫలకంపై చెక్కనున్నారు. >> సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌ - 10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌ >> రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌ - జమ్మూకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన 4వ బెటాలియన్‌ లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌ - 5 ఫీల్డ్‌ రెజిమెంట్‌ >> హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ - 237 ఫీల్డ్‌ వర్క్‌షాప్‌ >> సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ - ఎయిర్‌ఫోర్స్‌ 39వ వింగ్‌ >>అగ్నివీర్‌ మురళీ నాయక్‌ - 851 లైట్‌ రెజిమెంట్‌ ఈ సంవత్సరంలో వివిధ సైనిక చర్యలలో తమ ప్రాణాలను అర్పించిన సైనికుల పేర్లను నమోదు చేసే ఆర్మీ వార్ మెమోరియల్ యొక్క 2025 గౌరవ పట్టికలో ఈ పేర్లను చేర్చారు. స్మారక చిహ్నం యొక్క సంప్రదాయంలో భాగంగా, వారి పేర్లను న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఉన్న స్మారక ఇటుకలపై చెక్కనున్నారు. ఆరుగురిలో ఇద్దరికి శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం వీర్ చక్ర ప్రదానం చేయగా, సార్జెంట్ సురేంద్ర కుమార్ వాయు మెడల్‌తో గౌరవించింది. ఇక, గత సంవత్సరం పాకిస్థాన్‌పై భారతదేశం జరిపిన సైనిక చర్య 'ఆపరేషన్ సింధూర్'లో మరణించిన ఆరుగురు సైనికుల గుర్తింపులను అధికారికంగా వెల్లడించడం ఇదే మొదటిసారి. ఇందులో వీర మరణం పొందిన వారిలో మురళీ నాయక్... తెలుగు వ్యక్తి అనే సంగతి తెలిసిందే. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన మురళీ.. 2022లో అగ్నివీర్‌గా ఎంపికయ్యారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్ము కశ్మీర్‌లోని సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ పాక్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. గతేడాది మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన భారత సైన్యం... పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై విరుచుకుపడింది. పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లలోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్‌లో యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి కీలక లక్ష్యాలతో సహా 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత దళాలు విజయవంతంగా హతమార్చారు. ఈ భారీ నష్టం కారణంగా పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. ఈ క్రమంలోనే అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని భారత్ స్పష్టం చేసింది.