ఆన్‌లైన్ మోసాల బారినపడిన ఖాతాదారులకు గుడ్‌న్యూస్

అక్షర ఆయుధం : దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాల బారిన పడేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మోసాల బారినపడి అనేకమంది లక్షలాది రూపాయలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.అలాంటి బాధితులకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిర్ణయం తీసుకుంది.డిజిటల్ ఫ్రాడ్ కాంపెన్సేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చింది.ఎలక్ట్రానిక్ పేమెంట్ మోసాలకు సంబంధించి గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం పొందేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో ఒక తప్పుడు లింక్ క్లిక్ చేసినా, నకిలీ కేవైసీ అప్‌డేట్ పేరుతో మోసపోయినా ఖాతాలోని డబ్బులు మాయమయ్యేవి. ఇలా క్రెడిట్ కార్డులు,డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారినపడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ మోసాల బారిన పడే బాధితులకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిజిటల్ ఫ్రాడ్ కాంపెన్సేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చింది. చిన్నపాటి ఎలక్ట్రానిక్ పేమెంట్ మోసాలకు సంబంధించి గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం పొందేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. సైబర్ నేరాల బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించడమే ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రధాన ఉద్దేశంగా ఆర్బీఐ పేర్కొంది. గరిష్టంగా రూ.25వేలు పరిహారంకొవిడ్ అనంతరం దేశవ్యాప్తంగా యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ లావాదేవీలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. డిజిటల్ లావాదేవీలు ఎంత వేగంగా పెరిగాయో అంతే వేగంతో సైబర్ మోసాలు సైతం పెరిగాయి. డిజిటల్ మోసాల బారినపడి అనేక మంది నగదును కోల్పోయిన సంగతి తెలిసిందే. సైబర్ నేరగాళ్లు తమ ఖాతాను ఖాళీ చేయడంతో ఎంతోమంది తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి వారికోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మోసాల బారిన పడిన వినియోగదారులకు ఆర్థికంగా భరోసా కల్పించడం కోసం ఆర్‌బీఐ ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. దీని ప్రకారం అనధికారికంగా జరిగిన డిజిటల్ లావాదేవీని గుర్తించిన ఐదు రోజుల్లోగా కస్టమర్ తన బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే... దర్యాప్తు అనంతరం షరతులకు లోబడి గరిష్ఠంగా రూ. 25,000 వరకు పరిహారం పొందే అవకాశం ఆర్బీఐ కల్పించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆన్ లైన్ బాధితులకు ఊరటనివ్వనుంది.ఐదు రోజుల్లో పూర్తిచేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా తీసుకువచ్చిన డిజిటల్ ఫ్రాడ్ కాంపెన్సేషన్ ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం ఖాతాదారులకు తెలియకుండా తమ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు జరిగినట్లు నిర్ధారిస్తే పరిహారం పొందేందుకు ఐదు రోజుల్లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది అని ఆర్బీఐ పేర్కొంది.అలాగే 1930 నేషనల్ హెల్ప్‌లైన్‌కు కూడా ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా రెండు చోట్లా రిపోర్ట్ చేయడం వల్ల అధికారులు పోగొట్టుకున్న సొమ్మును వేగంగా ట్రాక్ చేసేందుకు ఈజీ అవుతుంది.అయితే ఈ రూ.25,000 పరిహారం అనేది వినియోగదారులకు జీవితకాలంలో ఒకసారి మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. అయితే ఆర్బీఐ తీసుకువచ్చిన ఈ కొత్త రూల్ మధ్యతరగతి కుటుంబాలకు, సీనియర్ సిటిజన్లకు ఒక భరోసా కల్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇకపై రూ.500 దాటిన ప్రతి లావాదేవీకి బ్యాంకులు తప్పనిసరిగా ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పంపాల్సి ఉంటుంది అని ఆర్బీఐ సూచించింది. అంతేకాదు ఖాతాదారులందరికీ 24x7 ఫిర్యాదు చేసే సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. ఇలా చేస్తే నగదు జమఖాతా దారుడు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి.అలాగే మీ బ్యాంక్ 24x7 హెల్ప్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా సమాచారం అందించాలి. ఆ తర్వాత మీ ఫిర్యాదుకు సంబంధించిన అఫీషియల్ ఐడీ నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఐదు రోజుల పనిదినాల్లోపు ఈ ఫిర్యాదులు జరగాలి. ఆ తర్వాత బాధితుడి ఖాతాలో నగదు జమ అవుతుంది. అయితే ఈ మార్పులన్నీ 2027, జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని ఆర్బీఐ పేర్కొంది.అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలపై ఆర్బీఐ కీలక సూచనలుమరోవైపు సైబర్ మోసాలు జరగకుండా ఆర్బీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు తమ అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని సూచించింది.ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్‌) మోడల్స్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా కొత్త మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం, మోసపూరిత పద్ధతులను పసిగట్టడం, కస్టమర్ల ఖాతాలను నిజ సమయంలో పర్యవేక్షించే అవకాశం ఉందని ఆర్బీఐ తెలిపింది. ఏఐ మోడల్స్‌ను మరింత మెరుగ్గా నిర్వహిస్తే వినియోగదారులు డబ్బు కోల్పోకముందే మోసాలను గుర్తించి వాటిని నియంత్రించే అవకాశం పెరుగుతుంది అని ఆర్బీఐ పేర్కొంది.