అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగాసనాలతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ

ప్రపంచానికి యోగా ప్రాముఖ్యత చాటిన మోదీ.. వేడుకలు ఘనంగా

పయనించే సూర్యుడు న్యూస్ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉత్సాహంతో యోగాసనాలు వేశారు. అంతకంటే ముందు ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రాత్మక 'రెడ్ రోడ్'లో జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉత్సాహంతో యోగాసనాలు వేశారు. అంతకంటే ముందు ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూపిస్తున్న చొరవను కొనియాడారు. ఈ రోజు భౌగోళిక సరిహద్దులను దాటి ఒక భారీ సామూహిక ఉద్యమంగా ఎదిగిందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా రూపాంతరం చెందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. అనంతరం ఆయన అందరితో కలిసి యోగాసనాలు వేశారు. వివిధ ఆసనాలతో ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీ, ఇతర సాధకులు తమ మెడను పక్కకు తిప్పుతూ, శరీర సమతుల్యతను పెంపొందించే ప్రాథమిక సూక్ష్మ వ్యాయామాలను చేసారు. చేతులను భుజాలపై ఉంచి వృత్తాకారంలో తిప్పడం అలాగే చేతులను ఇరువైపులా సమాంతరంగా చాచి శరీరానికి అవసరమైన సాగతీత ఇవ్వడం ద్వారా వెన్నుపూస మరియు చేతుల కండరాలను బలోపేతం చేసే ఆసనాలను ప్రధాని ప్రదర్శించారు. నడుముపై చేతులు ఉంచి, శ్వాసపై ధ్యాస నిలుపుతూ నడుము భాగాన్ని ఇరువైపులా తిప్పే వ్యాయామంలో ప్రధాని మోదీ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు